Pawan Kalyan: చిన్మయ్ కృష్ణ ప్రభు అరెస్ట్‌పై పవన్ ట్వీట్..! 16 d ago
చిన్మయ్ కృష్ణ ప్రభు అరెస్ట్‌పై పరస్పర విరుద్ధ న్యాయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించారు. ముంబై ఉగ్రదాడి నిందితుడి పట్ల భారత కోర్టు తీరు..చిన్మయ్ కృష్ణ పట్ల బంగ్లా తీరును పవన్ ప్రస్తావించారు. ఓ ఉగ్రవాదికి న్యాయం ఎలా ఉంటుందో భారత్ చూపిందని, కసబ్‌కు న్యాయ సహాయంతో పాటు ఎన్నో చేశారని అన్నారు. కానీ చిన్మయ్ కృష్ణ ప్రభు విషయంలో అలా జరగడంలేదని, చిన్మయ్ కృష్ణ ప్రభు విషయంలో సెక్యులరిస్టులు..మానవ హక్కుల చాంపియన్లు ఏమైపోయారని ప్రశ్నించారు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో న్యాయమా, చిన్మయ్ కృష్ణ కోసం మాట్లాడాల్సిన సమయం ఇది అని పవన్ ట్వీట్ చేసారు.